ప్రజా కోణం చూడాలి
జిల్లా ఏర్పాటు అనేది ప్రజల ఆకాంక్ష మేరకు జరిగింది. అప్పటి పాలకులు జిల్లాను ముక్కలు చేయాలని చూస్తే.. ప్రజలు ఉద్యమించి సాధించుకున్నారు. ఇప్పుడు మళ్లీ జిల్లాలను కుదించి.. రాజన్నసిరిసిల్ల జిల్లాను తొలగిస్తామంటే ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధమవుతారు. ప్రజా కోణమే చూడాలి.
– ఆవునూరి రమాకాంత్‌రావు, జిల్లా సాధన జేఏసీ చైర్మన్
జిల్లా సాధన కోసం అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసులతో జైలుకు వెళ్లాం. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మేం జైలులో ఉండగానే జిల్లా ఏర్పాటు ప్రకటన వచ్చింది. జైలు అధికారులే మీ ఉద్యమం వృథా కాలేదని చెబుతూ అభినందించారు. మేం పడిన కష్టాలన్నీ మరిచిపోయి సంతోషపడ్డాం. ఇప్పుడు జిల్లాను రద్దు చేస్తామంటే ఊరుకోం.
– చొక్కాల రాము, జిల్లా సాధన జేఏసీ ప్రతినిధి
2016లో జైలుకు వెళ్లాం. ఇప్పుడు రద్దు చేయడం సరికాదు. పాలకులు మారినప్పుడల్లా జిల్లాల స్వరూపం మార్చడం సరికాదు. ప్రభుత్వం ఆలోచించి జిల్లాను కొనసాగించాలి. ఇది ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమాలతో సాధించుకున్న జిల్లా. అప్పటి ప్రతిపక్ష నేతగా రేవంత్‌రెడ్డి జిల్లా సాధనకు సంఘీభావం తెలిపిన సంగతి మరిచిపోవద్దు.
– లింగంపల్లి మధుకర్, జిల్లా సాధన జేఏసీ ప్రతినిధి


