వృద్ధులకు డే కేర్ సెంటర్
సిరిసిల్ల: వృద్ధుల కాలక్షేపానికి డేకేర్ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. జిల్లా సీనియర్ సిటిజన్ డైరీని అసోసియేషన్ ప్రతినిధులు శనివారం కలెక్టర్‌కు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ మీ అనుభవాలు భవిష్యత్ తరాలకు అందించేలా ప్రయత్నించాలన్నారు. ప్రభుత్వం డేకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని, తొందరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సీని యర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, ప్రతినిధులు కోడం నారాయణ, దొంత దేవదాస్, డాక్టర్ జనపాల శంకరయ్య, ఏనుగుల ఎ ల్లయ్య, శ్రీగాద మైసయ్య, గౌరిశెట్టి ఆనందం, గుడ్ల శ్రీధర్, కైలాసం, శ్రీహరిరెడ్డి, రాజిరెడ్డి, శ్రీహరి ఉన్నారు.


