నేరం.. కారాగారం
నిందితులను పట్టుకునేందుకు పోలీసుల కొత్త పద్ధతులు సాంకేతికతతో సత్వర ఛేదన ఈ ఏడాది 71 కేసుల్లో 82 మందికి జైలు, జరిమానా
3 హత్య కేసుల్లో ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు
4 కేసుల్లో ఐదుగురికి ఐదేళ్ల జైలు
1 కేసులో ఒకరికి నాలుగేళ్ల జైలు
11 కేసుల్లో 14 మందికి మూడేళ్ల జైలు
2 కేసుల్లో ముగ్గురికి రెండేళ్ల జైలు
26 కేసుల్లో 28 మందికి ఏడాది జైలు
24 కేసుల్లో 26 మందికి ఏడాది లోపు శిక్ష
సిరిసిల్లక్రైం: జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిందితులకు కటకటాలకు పంపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు జిల్లాలో 71 కేసుల్లో తీర్పులు వెలువడగా, 82 మంది నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధించబడినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. నేరం చేసినవారు శిక్ష నుంచి తప్పించుకోలేరని, పోలీసులు, ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో వ్యూహాత్మకంగా విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తున్నారు.
ఆధునిక టెక్నాలజీతో..
జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల మర్మాన్ని ఛేదిస్తున్నారు. నిందితుల కదలికలను గుర్తించడంలో సీసీటీవీ ఫుటేజ్, వీడియో అనాలిటిక్స్, మొబైల్ ఫోరెన్సిక్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. సైబర్‌క్రైం కేసుల్లో కాల్ డేటా, జీపీఎస్ లొకేషన్ ఆధారంగా నిందితులను పట్టుకుంటున్నారు. అంతేకాకుండా డీఎన్‌ఏ పరీక్షలు, ఫింగర్‌ప్రింట్, పాల్మ్ ప్రింట్ విశ్లేషణలు, ఆయుధాల ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా పటిష్ట సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఆధునిక ఫేసియల్ రికగ్నిషన్, లైసెన్స్ ప్లేట్ రీడర్ కెమెరాలు (ఏఎన్పీఆర్), డ్రోన్ సర్వేలెన్స్ వంటి పద్ధతులు నిందిఉల కదలికలను ట్రాక్ చేయడంలో కీలకంగా ఉపయోగపడుతున్నాయి. సైబర్ ఫోరెన్సిక్ యూనిట్లు, సోషల్ మీడియా విశ్లేషణ ద్వారా మోసపూరిత ఆర్థిక నేరాల గుట్టు రట్టవుతోంది. అలాగే బ్యాంకింగ్ ట్రేస్‌లు, ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ ద్వారా డబ్బు లావాదేవీల దారిని అనుసరించి నిందితులను పట్టుకుంటున్నారు.
ప్రజల సహకారం.. పోలీసుల బలం
పోలీసులపై ప్రజలు నమ్మకం ఉంచాలి. చట్టాలను పాటించే పౌరసమాజం ఏర్పడితేనే నేరరహిత జిల్లా సాధ్యమవుతుందని పోలీసులు చెబుతున్నారు. మహిళలపై నేరాలు, మద్యం, గంజాయి, దొంగతనాలు, మోసపూరిత ఆర్థిక నేరాలపై ప్రత్యేక దష్టి సారించి, కేసులు త్వరితగతిన దర్యాప్తు చేయడం ద్వారా కోర్టుల్లో పటిష్ట సాక్ష్యాలతో ప్రాసిక్యూషన్ విజయవంతం అయ్యేందుకు ప్రజల నుంచి సహకారం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
పలు కేసుల్లో జైలు శిక్షల వివరాలు
ప్రజలు సహకరించాలి


