రిలాక్స్..
కష్టానికి గుర్తింపు
ప్రస్తుతం కేజీబీవీలో టీచర్‌గా పని చేస్తున్న. జానపద విజ్ఞానం అంశంలో అత్యధిక మార్కులు సాధించా. స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకోవడం ఆనందంగా ఉంది. కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని ఆశిస్తున్న.
– కాదాసు నీరజ,
లింగంపేట, చందుర్తి
లక్ష్య సాధనకు శ్రమిస్తా
లక్ష్యాన్ని సాధించేందుకు శ్రమిస్తా. చిన్ననాటి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. మొన్నటి వరకు కేజీబీవీలో కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్‌గా పని చేశా. పెళ్లి కావడంతో మానేసిన. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న. పేద విద్యార్థులను తీర్చిదిద్దడమే నా లక్ష్యం.
– కాదాసు నర్మద లింగంపేట, చందుర్తి
సంస్కృత విద్యార్థికి స్వర్ణం
రుద్రంగి(వేములవాడ): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సంస్కృత కళాశాల విద్యార్థి రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నారంభట్ల శ్రీచరణ్‌కు స్వర్ణ పతకం వరించింది. స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నాడు.
సిరిసిల్ల: పల్లెల్లో వైబ్రేటింగ్ కుర్చీలను ఏర్పాటు చేసి, కార్పొరేట్ సెటప్‌తో ఆయుర్వేద మందులను విక్రయిస్తున్నారు. వైబ్రేటింగ్ కుర్చీలో కూర్చోబెట్టి బ్యాటరీ సాయంతో ఒకరకమైన మసాజ్ చేస్తున్నారు. ఇది చేయించుకున్న వారికి రిలాక్స్‌తో పాటు పాజిటివ్ అనుభూతి కలుగడంతో మోకాళ్ల నొప్పులు, తలనొప్పి తదితర ఆయుర్వేద మందులు ఉన్నాయని విక్రయిస్తున్నారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట బస్టాండులో ఈ తరహా సెటప్‌తో ఆయుర్వేద మందులను ఆధునిక విధానంతో విక్రయించడం విశేషం. మందులు ఎంత మేరకు పని చేస్తాయో లేదో తెలియదు కానీ.. ఒక్కో ఆయుర్వేద మందు సీసాకు రూ.700 నుంచి రూ.1000 వరకు వసూలు చేశారు.
రిలాక్స్..
రిలాక్స్..


