సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం

Nov 9 2025 7:41 AM | Updated on Nov 9 2025 7:41 AM

సీనియ

సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం

సిరిసిల్లటౌన్‌: జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల అధికారిగా డాక్టర్‌ జనపాల శంకరయ్య ఆధ్వర్యంలో కార్యవర్గం ఏర్పడింది. అధ్యక్షుడిగా చేపూరి బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి కోడం నారాయణ, ఉపాధ్యక్షులు శ్రీగాద మైసయ్య, ఏనుగుల ఎల్లయ్య, కోశాధికారి దొంత దేవదాసు, సహాయ కార్యదర్శులు గౌరిశెట్టి ఆనందం, అంకారపు జ్ఞానోబా, వికృతి ముత్తయ్యగౌడ్‌, కార్యనిర్వహక కార్యదర్శులు గుడ్ల శ్రీధర్‌, గజ్జల్లి రామచంద్రం, టమటం రామానుజమ్మ, మాదిరెడ్డి అంజనాదేవి, ప్రచార కార్యదర్శి బెజవాడ కై లాసం, 17 మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

విజయవంతం చేయండి

సిరిసిల్ల అర్బన్‌: కామ్రేడ్‌ చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి దశరథం అన్నారు. శనివారం పట్టణంలోని ఏఐఎఫ్‌టీయూ న్యూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. పట్టణంలోని శాంతినగర్‌ వరలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం కామ్రేడ్‌ చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు తెలపారు. సమావేశంలో నాయకులు గుజ్జ దేవదా స్‌, ఏ.సత్తయ్య, నర్సయ్య, తదితరులున్నారు.

హమాలీ

సమస్యలు పరిష్కరించాలి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): హమాలీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. శనివారం మండలంలోని పొత్తూరు గ్రామంలో హమాలీ కార్మికుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మికులకు తాడు మాములు, హెల్త్‌ కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం రూ.25 లక్షలు కల్పించాలని పేర్కొన్నారు. క్వింటాలుకు రూ.60 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొంపల్లి భూమిరెడ్డి, తాండ ఎల్లయ్య, పండు కొమురయ్య, మొండయ్య, శీను, బాలయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ జిల్లా మహాసభ వాయిదా

సిరిసిల్ల అర్బన్‌: జిల్లాలో ఈనెల 16,17 తేదీల్లో ని ర్వహించే ఏఐటీయూసీ జిల్లా మహాసభలు వా యిదా వేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, కార్యదర్శి కడారి రాములు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అని వార్య కారణాలతో వాయిదా వేసినట్లు తెలిపారు.

డీలర్‌ను నిలదీసిన

లబ్ధిదారులు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్ల తిమ్మాపూర్‌లో ఓ చౌక ధరల దుకాణం డీలర్‌ రేషన్‌ బియ్యం తూకంలో మోసానికి పాల్ప డ్డాడు. సదరు డీలరు శనివారం లబ్ధిదారుల కు రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తుండగా ఎప్పటిలాగానే బియ్యం తీసుకునేందుకు వెళ్లిన లబ్ధి దారులు బియ్యం తీసుకొని ఇంటికొచ్చారు. అనుమానంతో తూకం వేయగా 10 కిలోల బియ్యానికి గాను 800 గ్రాములు తక్కువగా వచ్చిందని గుర్తించారు. దీంతో రేషన్‌ దుకా ణానికి వెళ్లి డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తనకు 50 కిలోలకు 500 గ్రాముల చొప్పున బియ్యం తరుగు వస్తుందని అందుకే ఎలక్ట్రికల్‌ కాంటాపై సంచిని పెట్టి తూకం వేస్తున్నట్లు డీలర్‌ సమాధానమిచ్చాడు. దీనిపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. కాగా, సదరు డీలర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు లబ్ధిదారులు పేర్కొన్నారు.

సీనియర్‌ సిటిజన్‌  అసోసియేషన్‌  ప్రమాణ స్వీకారం
1
1/1

సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement