
లైటింగ్ ఏర్పాటు చేయాలి
సిరిసిల్లటౌన్: బతుకమ్మ పండుగల నేపథ్యంలో సాయిబాబా గుడి వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషాను కొత్తబస్టాండ్ అభివృద్ధి కమిటీ కోరింది. సోమవారం వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ బతుకమ్మ నేప థ్యంలో మానేరుకు వెళ్లేందుకు రోడ్డు వేయించాలని కోరారు. ఆర్టీసీ కార్గో సేవలు కొత్త బస్టాండ్‌లో అందించాలని, డిపో ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయించాలని కోరారు.
చందుర్తి(వేములవాడ): చందుర్తి, కోనరావుపేట మండలాల మధ్య మూడు గ్రామాల రైతులు ఎలుగుబంటి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట, మామిడిపల్లి, చందుర్తి మండలం బండపల్లి గ్రామాల మధ్య జొన్నగుట్ట ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ఈ ప్రాంత రైతులు గుర్తించారు. దీంతో పంట చేలలోకి వెళ్లేందుకు వణుకుతున్నారు. ఎలుగుబంటి పాదముద్రలను గుర్తించారు.
వేములవాడరూరల్: వేములవాడ మున్సిపల్ పరిధిలోని మెప్మాలో ఉన్న శ్రీనిధి నుంచి డబ్బులు గోల్‌మాల్ అయినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. మెప్మా జిల్లా అధికారి భూలక్ష్మి, శ్రీనిధి అధికారి గీతాంజలి సోమవారం విచారణ చేపట్టారు. కోనాయపల్లి ఆర్‌పీ పరి ధిలో దాదాపు 20 మహిళా సంఘాలు ఉండగా, ఆయా సంఘాల సభ్యులు బ్యాంకులో జమచేసిన డబ్బుల్లో గోల్‌మాల్ జరిగిందనే ఫిర్యాదుపై వివరాలు సేకరించారు. పది రోజుల్లో పూర్తి విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై ఆర్‌పీ మాట్లాడుతూ తాను డబ్బులు వాడుకున్నట్లు కొంత మంది కావాలనే దుష్ప్రచారం చేశారన్నారు.
చందుర్తి(వేములవాడ): తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితోనే ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి విమలక్క పేర్కొన్నారు. మండలంలోని బండపల్లిలోని కామ్రేడ్ గడ్డం తిరుపతిరెడ్డి స్థూపం వద్ద సోమవారం నివాళి అర్పించి మాట్లాడారు. సాయుధ పోరాటాల ఫలితంగానే దున్నేవాడికి భూమి దక్కిందన్నారు. జిల్లా ను ంచి బద్దం ఎల్లారెడ్డి, అమృతలాల్ శుక్లా, సింగిరెడ్డి భూపతిరెడ్డి, కర్రోల్ల నర్సయ్య తెలంగా ణ సాయుధ పోరాటంలో ముందున్నారని గు ర్తు చేశారు. మల్యాల నర్సయ్య, తిక్కల నర్స య్య, రాచకొండ లచ్చయ్య, గోపిరెడ్డి లక్ష్మి, కొండ లచ్చవ్వ, తీపిరెడ్డి మల్లవ్వ, రాచకొండ లచ్చయ్య, పురంశెట్టి రాజు పాల్గొన్నారు.
బైపాస్‌లో వెండి వెలుగులు
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న రెండు బైపాస్‌రోడ్లు వెండి వెలుగులీనుతున్నాయి. పదకొండు కిలోమీటర్లు విస్తరించిన రెండు బైపాస్‌రోడ్లలో ఎల్‌ఈడీ లైట్లను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సోమవారం ప్రారంభించారు. మొదటి, రెండో బైపాస్ రోడ్లు రగుడు జంక్షన్ నుంచి విద్యానగర్ జంక్షన్ వరకు 4 కిలోమీటర్లు, రగుడు జంక్షన్ నుంచి వయా చంద్రంపేట నుంచి వెంకటపూర్ వరకు 11 కిలోమీటర్ల వరకు ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. రూ.7.10 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు.

లైటింగ్ ఏర్పాటు చేయాలి

లైటింగ్ ఏర్పాటు చేయాలి

లైటింగ్ ఏర్పాటు చేయాలి

లైటింగ్ ఏర్పాటు చేయాలి