● లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ● పోలీసుల పాత్రపై వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్‌ ● బెయిల్‌ కోసం నిందితులు.. కస్టడీ కోసం పోలీసుల యత్నం ● మాజీ మంత్రి సంబంధాలపైనా కేంద్ర సంస్థల ఆరా ● ఎవరినీ వదలొద్దంటున్న కేంద్ర సహాయ మంత్రి సంజయ్‌ | - | Sakshi
Sakshi News home page

● లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ● పోలీసుల పాత్రపై వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్‌ ● బెయిల్‌ కోసం నిందితులు.. కస్టడీ కోసం పోలీసుల యత్నం ● మాజీ మంత్రి సంబంధాలపైనా కేంద్ర సంస్థల ఆరా ● ఎవరినీ వదలొద్దంటున్న కేంద్ర సహాయ మంత్రి సంజయ్‌

Sep 16 2025 8:30 AM | Updated on Sep 16 2025 8:30 AM

● లోత

● లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ● పోలీసుల పాత్రపై

● లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ● పోలీసుల పాత్రపై వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్‌ ● బెయిల్‌ కోసం నిందితులు.. కస్టడీ కోసం పోలీసుల యత్నం ● మాజీ మంత్రి సంబంధాలపైనా కేంద్ర సంస్థల ఆరా ● ఎవరినీ వదలొద్దంటున్న కేంద్ర సహాయ మంత్రి సంజయ్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

క్రిప్టో కరెన్సీ వ్యవహారం రానురాను తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తోంది. తాజాగా ఈ కేసు విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కూడా స్పందించడం గమనార్హం. మెటా ఫండ్‌ క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో నిందితులను ఎవరినీ వదలవద్దని డిపార్ట్‌మెంట్‌కు బండి సంజయ్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కేసును కరీంనగర్‌ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు డబ్బులు వసూలు చేసిన తీరుపై పోలీసులు దృష్టి సారించారు. టూ టౌన్‌, రూరల్‌ ఠాణాల్లో కేసులు నమోదైనా.. సీసీఎస్‌ సాయంతో కేసును సీపీ గౌస్‌ ఆలం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులు, నిందితుల నుంచి డబ్బుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఫిర్యాదు చేసేందుకు మరిన్ని బృందాలు ముందుకు వస్తుండగా.. మరికొందరు కేసు నమోదుకు వెనకాడుతున్నా.. దర్యాప్తునకు దోహదపడేలా ఆధారాలు మాత్రం పోలీసులకు ఇస్తున్నారు. ఓ వైపు నిందితులు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కస్టడీ పిటిషన్‌ వేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు.

పోలీసులు, మాజీ మంత్రి పాత్రపై ఆరా

మెటా క్రిప్టో స్కాంలో రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలు నాలుగు నెలల క్రితమే వేర్వేరుగా వివరాలు సేకరించాయి. ఇప్పటి వరకూ అరైస్టెన ఐదుగురు నిందితుల్లో ఒకరికి మాజీ మంత్రి, ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడితో గతంలో బాగా సఖ్యత ఉండేది. సదరు వ్యక్తి మంత్రి హోదాలో తరచుగా కరీంనగర్‌ వచ్చిన ప్రతీసారీ, అతని ఇంటికి తప్పకుండా వెళ్లేవారు. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు సదరు మాజీ మంత్రి పాత్రపై ఆరా తీశాయి. వసూలు చేసిన డబ్బును నిందితులు దేశం దాటించారని బాధితులు ఆరోపిస్తున్న క్రమంలో సదరు మాజీ మంత్రికి, నిందితుడికి ఏమైనా లావాదేవీలు జరిగాయా? అన్న కోణంలో తనిఖీలు చేశాయి. అదే సమయంలో బాధితులు (ప్రభుత్వ ఉద్యోగులు) నిందితుడిని డబ్బుల కోసం నిలదీసిన ప్రతీసారి సదరు మాజీ మంత్రి పేరు చెప్పి వారిని బెదిరించినట్లు సమాచారం. అదే సమయంలో క్రిప్టోలో పెట్టుబడులు పెట్టిన నలుగురు సీఐల వివరాలు కూడా నిఘా వర్గాలు సేకరించాయి. వారికి డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా.. పైపెచ్చు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన వైనంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వేధిస్తున్న విధానాన్ని కూడా గుర్తించినట్లు తెలిసింది. అదే సమయంలో క్రిప్టో కేసులో మోసపోయిన బాధితులను బెదిరించి, నిందితులకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎస్‌హెచ్‌వో పాత్రపైనా ఉన్నతాధికారులకు అన్ని వివరాలు అందాయి.

● లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ● పోలీసుల పాత్రపై1
1/2

● లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ● పోలీసుల పాత్రపై

● లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ● పోలీసుల పాత్రపై2
2/2

● లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ● పోలీసుల పాత్రపై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement