
అద్దె భవనాల్లో కోర్టులు
సిరిసిల్లకల్చరల్: నూతనంగా న్యాయ నిర్మాణ భవన్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో నాలుగు న్యాయస్థానాలు అద్దె భవనాల్లోకి మారాయి. సోమవారం నుంచి నూతన అద్దె భవనాల్లో కేసుల విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి, రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టులు వ్యాన్ల అడ్డా వద్ద గల భవనంలోకి మారాయి. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మున్సిపల్ కమిషనర్ రెసిడెన్షియల్ క్వార్టర్‌లో కొనసాగుతుండగా ఇప్పుడు ఉన్న పాత కాంప్లెక్స్‌లో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు, ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ జడ్జి కోర్టు యథాతథంగా కొనసాగుతున్నాయి.