
సరిపడా యూరియా నిల్వలు
సిరిసిల్ల/బోయినపల్లి/వేములవాడఅర్బన్: యూరియా కోసం రైతులు ఆందోళ చెందవద్దని.. జిల్లాలో పంటలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. బోయినపల్లి మండలం కొదురుపాక రైతువేదికలో సోమవారం యూరియా పంపిణీని తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం తదితరులు ఉన్నారు. గ్యాస్ స్టవ్‌పైనే విద్యార్థులకు భోజనం వండాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. వేములవాడ మండలం చింతాల్‌ఠాణాలోని ప్రైమరీ స్కూల్‌ను తనిఖీ చేశారు. కిచెన్‌షెడ్డు పరిశీలించారు.
ఓటర్ల జాబితా రివిజన్‌కు సిద్ధం కావాలి
స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. డూప్లికేట్, దొంగ ఓట్ల తొలగింపునకు 20 నుంచి 25 ఏళ్లకోసారి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేయడం జరుగుతుందని, తెలంగాణలో 2002లో చేసినట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్‌పై మాస్టర్ ట్రైయినర్ల ద్వారా బూత్‌స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ బీఎల్‌వో దగ్గర 2002 ఎస్.ఐ.ఆర్, 2025 ఎస్.ఎస్.ఆర్ హార్డ్ కాపీలు ఉండాలని, ఈ రెండు జాబితాలో కామన్‌గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు సీహెచ్ వెంకటేశ్వర్లు, రాధాబాయి పాల్గొన్నారు.
స్వచ్ఛతా హీ సేవ పోస్టర్ ఆవిష్కరణ
స్వచ్ఛతా హీ సేవ–2025 పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను పరిశుభ్రం చేసి, ఆ ఫొటోలను ఆన్‌లైన్‌లో ఉంచాలి. 25న ప్రతి ఒక్కరూ గంట సేపు శ్రమదానం చేసేలా ప్రోత్సహించడమే స్వచ్ఛతా హీ సేవ లక్ష్యమన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీపీవో షరీఫొద్దీన్, డీఎల్‌పీవో నరేశ్, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.