
17న ప్రజాపాలన దినోత్సవం
● ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 17న ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని జీవోలో స్పష్టం చేసింది.
భవన కార్మికులను ఆదుకోవాలి
సిరిసిల్లటౌన్: భవన నిర్మాణరంగ కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలని నిర్మాణరంగ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ కోరారు. జిల్లా కేంద్రంలోని శివనగర్ శివాలయంలో సోమవారం మూడో మహాసభలు నిర్వహించారు. రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నిధులను పక్కదారి పట్టించేలా తీసుకొచ్చిన జీవో 12తో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వెంటనే సవరించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నాయకులు కోడం రమణ, మిట్టపల్లి రాజమల్లు, ఎగమంటి ఎల్లారెడ్డి, గీస భిక్షపతి, గురజాల శ్రీధర్, కోల శ్రీనివాస్, ఈసంపల్లి రాజెలయ్య, గుంటుకు నరేందర్, సావనపల్లి ప్రభాకర్ పాల్గొన్నారు.

17న ప్రజాపాలన దినోత్సవం