
భక్తుల రక్షణే ధ్యేయం
● ఎస్పీ మహేశ్ బీ గీతే
వేములవాడ: రాజన్న ఆలయ భద్రత, భక్తుల రక్షణే ధ్యేయంగా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. ఆలయ చైర్మన్ చాంబర్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం భీమేశ్వరాలయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ఇబ్బందులు పడకుండా దర్శనం పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ద్వారాలు, క్యూలైన్‌లు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన వీధులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాన రహదారుల్లో డైవర్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆలయ ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ డేకు 36 ఫిర్యాదులు
సిరిసిల్లక్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 36 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. త్వరగా పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు సూచించారు.