
విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలి
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా జరుపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్లలో మాట్లాడారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు నరకాన్ని అనుభవించారని పేర్కొన్నారు. తెలంగాణకు స్వాతంత్య్రం దక్కిన 17 సెప్టెంబర్ గురించి నేటి తరానికి తెలియకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. 2014లో స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవచ్చని ప్రజలు అనుకున్నారని, కానీ నాటి సీఎం కేసీఆర్ ద్వంద్వ వైఖరి వల్ల తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలే అయ్యాయన్నారు. 2022లో తొలిసారి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించగా కేంద్రం నిర్వహించిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి కేంద్రమే నిర్వహిస్తూ వస్తోందని, ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆడెపు రవీందర్, పొన్నాల తిరుపతిరెడ్డి, బర్కం లక్ష్మి, రాజిరెడ్డి తదితరులున్నారు.