
కాంగ్రెస్ పార్టీతోనే అట్టడుగువర్గాల అభివృద్ధి
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
సిరిసిల్ల అర్బన్: అట్టడుగు వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని కేకన్వెన్షన్ హాల్‌లో అంబేడ్కర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ అధ్యక్షతన జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి చీఫ్‌గెస్ట్‌గా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని అంబేడ్కర్ సంఘాల నాయకుల, దళిత సంఘాల నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో విప్ ఆది శ్రీనివాస్, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆశీర్వాదంతో మంత్రిగా కొనసాగుతున్నాన్నారు. గత ప్రభత్వం హయాంలో కేటీఆర్, సంతోష్‌రావు నేరెళ్ల దళితుల మీద దాడులు చేయించారన్నారు. అప్పటి పార్లమెంట్ స్పీకర్ మీరాకుమారి నేరెళ్లను సందర్శించారని.. దళితులపై జరిగిన దాడులను చూసి చలించిపోయారన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజనవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మాదిగ బిడ్డగా నాకు, మాల బిడ్డగా వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సెస్ డైరెక్టర్ సుధాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూప, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, అంబేడ్కర్ సంఘాల నాయకులు వెంకటమల్లయ్య, దర్మెందర్, అక్కని భాను తదితరులు పాల్గొన్నారు.