
వాతావరణం
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి.
హైకోర్టు న్యాయమూర్తులకు ఆహ్వానం
సిరిసిల్లటౌన్: జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైకోర్టు న్యాయమూర్తులు తుకారాంజి, ఓ. శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లో కలిశారు. త్వరలో జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా కోర్టు భవనముల సముదాయం భూమి పూజలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ న్యాయవాదులు జి.భాస్కర్‌రెడ్డి, సురేశ్, ఆవునూరి రమాకాంత్‌రావు, సీహెచ్.మహేశ్‌గౌడ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి టి.వెంకటి, ఉపాధ్యక్షుడు ఎస్.అనిల్‌కుమార్, కోశాధికారి వేముల నరేశ్ ఉన్నారు.
ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ అభివృద్ధి
వేములవాడ: ఆగమశాస్త్రం ప్రకారమే రాజన్న ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పనుల పురోగతిపై మంగళవారం ఆలయ చైర్మన్ చాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం దేవాదాయశాఖ కమిషనర్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విప్, కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. అనంతరం విప్ మాట్లాడుతూ, శృంగేరి పీఠాధిపతుల సూచనలతో ఆలయ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. పనులకు టెండర్లు పిలిచామని, 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత కింద రూ.76 కోట్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. పనులు జరిగే సమయంలో భీమేశ్వ ర ఆలయంలో భక్తులకు దర్శనం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భీ మేశ్వర ఆలయంలో ఇప్పటికే పనులు చివరి ద శలో ఉన్నాయని త్వరలోనే పూర్తి చేస్తామన్నా రు. ఆలయ అభివృద్ధి పనులకు భక్తులు, స్థాని కులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

వాతావరణం