
పాఠశాల సందర్శన
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలకేంద్రంలోని హైస్కూల్‌ను మంగళవారం అదనపు కలెక్టర్ జి.నాగేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజ నం, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం మండలంలోని గాలిపెల్లి బీసీ హాస్టల్‌ను సందర్శించారు. వంట గదిలో విద్యార్థులకు అందిస్తున్న పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారం మ ధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. హెచ్‌ఎం ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.
జ్వరపీడితులకు డెంగీ పరీక్షలు చేయించాలి
రుద్రంగి(వేములవాడ): విష జ్వరాలు ప్రబ లుతున్న నేపథ్యంలో ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో రజిత పేర్కొన్నారు. మంగళవారం డీఐవో సంపత్‌కుమార్‌తో కలిసి రుద్రంగి మండల కేంద్రంలోని పల్లె దవాఖానా, మానాల, గైదిగుట్ట తండాల్లో డ్రై డే కార్యక్రయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. జ్వర పీడితులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించాలన్నారు. అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఆదేశించారు.
ఐకేపీ కేంద్రానికి స్థలం కేటాయించాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): అసైన్డ్ భూమిలో రైతులందరికీ ఉపయోగపడేలా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించాలని మంగళవారం వెంకట్రావుపల్లె గ్రామస్తులు ముస్తాబాద్–సిద్దిపేట రహదారిపై బైఠాయించారు. అసైన్డ్ భూమిలో 40 ఎకరాలకు పైగా ఉందని పేర్కొన్నారు. గ్రామస్తులను తహసీల్దార్ సురేశ్, ఎస్సై గణేశ్ వెంకట్రావుపల్లెకు చేరుకుని గ్రామస్తులను శాంతింపజేశారు. మరోచోట ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. కాగా వెంకట్రావుపల్లెలో శాంతిభద్రతల పరిరక్షణకు బీఎన్‌ఎస్ సెక్షన్ 163(144) వర్తింపజేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు గ్రామంలో అదనపు బలగాలను మోహరించారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్లక్రైం: ఇరువర్గాల వారు రాజీపడుతూ న్యాయం పొందేలా ఈ నెల 13న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. చిన్నచిన్న కేసులతో కక్షలు పెంచుకుని సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దన్నారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి రాజీపడేలా అవగాహన కల్పించాలని సూచించారు.
మల్కపేట రిజర్వాయర్‌కు మిడ్‌మా‘నీరు’
కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట: మిడ్‌మానేరు నుంచి కోనరావుపేట మండలం మల్కాపేట రిజర్వాయర్‌లోకి మంగళవారం నీటి విడుదల ప్రారంభమైంది. సుమారు 1.5 టీఎంసీల నీరు విడుదల చేయాలని విప్ ఆది శ్రీనివాస్ అధికారులతో మాట్లాడారు. నీటి విడుదల కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విప్ ఆది తీవ్రంగా ప్రయత్నించి మల్కపేట రిజార్వాయర్‌లోకి నీటిని తెచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య తెలిపారు. నీటి విడుదలకు కృషి చేసిన విప్, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నీటి విడుదలను ఈఈ కిశోర్, డీఈ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారన్నారు.

పాఠశాల సందర్శన

పాఠశాల సందర్శన

పాఠశాల సందర్శన