
ప్రతిష్టాత్మకంగా ‘సేవాపక్షం’
సిరిసిల్లటౌన్: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘సేవాపక్షం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జిల్లా కన్వీనర్ సిరికొండ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్వచ్ఛ భారత్, రక్తదాన శిబిరం, పేదలకు, వికలాంగులకు సహకరించడం వంటి తదితర సేవా కార్యక్రమాలు చేపట్టి శ్రీసేవాపక్షం్ఙ విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన కార్యాచరణ గురించి కార్యకర్తలకు వివరించారు. వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్‌రావు, ఎర్రం మహేశ్, అల్లాడి రమేశ్, రాష్ట్ర నాయకుడు లింగంపల్లి శంకర్, దేవేందర్‌యాదవ్, ఆడెపు రవీందర్, పొన్నాల తిరుపతిరెడ్డి, బండ మల్లేశం, శీలం రాజు, బర్కం లక్ష్మి, మల్లారెడ్డి, దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.