
పాడి పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి
బోయినపల్లి(చొప్పదండి): పాడి పరిశ్రమతో గ్రా మాల్లోని పేదలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం తో డ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మంగళవా రం మండలంలోని కొదురుపాకలో మినీ డెయిరీ (పైలెట్ ప్రాజెక్టు) కింద పాడి గేదెలు పంపిణీ చేశా రు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 19 మంది లబ్ధిదారులకు 38 గేదెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మండలంలో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి పాడి గే దెలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కొదురుపాకలోని పశు వైద్యశాల ఉపకేంద్రాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మతు చేయుటకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండలకేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఆన్ అకాడమీ ద్వారా ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించారు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేందుకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఆన్‌లైన్ తరగతుల ద్వారా మంచి శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కూల్‌కు 50 ఫ్యాన్లు మంజూరు చేయాలని అధికా రులను ఆదేశించారు. కార్యక్రమాల్లో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎంపీడీవో జయశీల, ప్యాక్స్ చైర్మన్లు వెంకట్రామారావు, సురేందర్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్‌యాదవ్ ఉన్నారు.