
నిర్భయంగా ఫిర్యాదు చేయండి
సిరిసిల్లక్రైం: మహిళలు, విద్యార్థుల రక్షణకు పోలీస్‌శాఖ షీటీం పేరిట రక్షణ చర్యలు అందిస్తుందని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. వేధింపులపై మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. గత నెలలో వేధింపులకు పాల్పడిన పోకిరీలపై 3 కేసులు, 5 పెట్టి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. షీటీమ్ అందించే సేవలపై విద్యాలయాలు, బస్టాండ్లు, జనరద్దీ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏదేని సమస్య ఉంటే 87126 56425లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.