
హాస్టళ్లలో సీట్ల భర్తీకి సహకరించాలి
సిరిసిల్ల: సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సీట్ల భర్తీకి అధికారులు సహకరించాలని ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు కోరారు. సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్, డీఎస్‌సీడీవో అధికారులతో డివిజన్ సలహా సంఘం సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 2025–2026 విద్యాసంవత్సరానికి కొత్త అడ్మిషన్లు 119 ఉండగా.. ఇంకా డివిజన్‌లో 254 సీట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు వివరించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు ఆయా ప్రాంతాల్లో పేద విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లలో చేరేలా ప్రోత్సహించాలని కోరారు. జిల్లా ఎస్సీడీవో డాక్టర్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా పాల్గొన్నారు.