
పరిసరాలు శుభ్రంగా ఉంచాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాలల్లో పరి సరాల పరిశుభ్రత చాలా ముఖ్య మని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. బుధవారం ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉ న్నత, ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల హాజరును స్వయంగా తీసుకున్నారు. జెడ్పీ స్కూల్ ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంపై అ సంతృప్తి వ్యక్తం చేశారు. చెత్త, గడ్డిని తొలగించాలని ఆదేశించారు. తరగతి గదులు, మధ్యా హ్న భోజనం తయారీని పరిశీలించారు. పాఠశాలకు ఇంటర్‌నెట్ కనెక్షన్ తీసుకోవాలని, డైనింగ్ హాల్‌లో బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల మైదానంలో సీసీ వేయాలని, డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఒకే చోటికి తీసుకురావాలని సూచించారు. మ ధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యిలపై వండరాద ని, అవసరమైన గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాలని ఎంఈవోను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి, హెచ్‌ఎం రవీందర్‌రెడ్డి, నాయకులు విజయ్‌రెడ్డి, భాను, తదితరులున్నారు.