
వడ్డీ రావడం సంతోషం
సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించగా, ఆరునెలల వడ్డీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరునెలల డబ్బుల కోసం కొంత జాప్యం జరిగింది. మొత్తానికి డబ్బులు రావడంతో అందరు సంతోషంగా ఉన్నారు. – వెన్నెల, వీవో, రాజన్నపేట
సకాలంలో చెల్లించాం
ప్రభుత్వం నుంచి సీ్త్రనిధి ద్వారా రుణం తీసుకున్నం. వడ్డీ వస్తుందనే సభ్యులు స క్రమంగా సకాలంలో రుణాలు చెల్లించారు. ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా వడ్డీ డబ్బులు వస్తే అందరూ ఆర్థికంగా బలపడుతారు. – కొల బాలలక్ష్మి, సింగారం
ఖాతాల్లో జమచేశాం
ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాగానే సభ్యుల ఖాతాల్లో జమ చేశాం. సభ్యులు వడ్డీ డబ్బుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన మహిళా సంఘాలకు క్రమం తప్పకుండా ప్రతి ఆరునెలలకు ఒకసారి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి వడ్డీ తీసుకోవడం అభినందనీయం. – మల్లేశం, ఏపీఎం, ఎల్లారెడ్డిపేట

వడ్డీ రావడం సంతోషం

వడ్డీ రావడం సంతోషం