
సదస్సును విజయవంతం చేయాలి
సిరిసిల్లకల్చరల్: రాజ్యాంగం సవాళ్లు.. దృక్పథాలు, పరిష్కారాలు అనే అంశంపై ఆగస్టు 2న సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సెల్ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ మార్గదర్శకాల మేరకు బుధవారం సంబంధిత పోస్టర్‌ను జిల్లా కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో శనివారం ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే సదస్సుకు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ బుర్ర రవితేజగౌడ్, అధికార ప్రతినిధి వంగల కర్ణ, బొద్దుల రాజేశ్, శేఖర్, అన్సార్ అలీ, జ్యోతి, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.