
కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పద్మనగర్‌లో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రారంభోత్సవానికి వస్తారని ఎదురుచూసిన విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్‌రావు, ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, వినయ్‌యాదవ్, ఆశీర్వాద్, ప్రశాంత్, భవిత, మహేందర్, సురేష్, శ్రీనివాస్, మధుసూదన్, తిరుపతి, బాలమల్లేశం, కేవీ ప్రిన్సిపాల్ శేషప్రసాద్ పాల్గొన్నారు.