
గంజాయి సరఫరాపై నిఘా
● ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రోత్సాహకాలు ● ఎస్పీ మహేశ్ బి గీతే
సిరిసిల్లక్రైం: గంజాయి రవాణా, వినియోగంపై నిఘా పెట్టినట్లు ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. ఆరు నెలల్లో 37 కేసుల్లో 95 మందిని అరెస్ట్ చేసి 3.5 కిలోల గంజాయి, 12 గంజాయి చెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసుల ఛేదనలో కృషిచేసిన సిబ్బందికి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రశంసాపత్రాలతోపాటు ప్రోత్సాహకాలు అందించారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని కోరారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్‌లు, నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.