
రేషన్‌కార్డు కీలకమైన డాక్యుమెంట్
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి(చొప్పదండి): రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, పేదల జీవితాల్లో రేషన్‌కార్డు కీలకమైన డాక్యుమెంట్ అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులు, పలువురికి సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కరెంట్ కనెక్షన్, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్‌కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ మండలంలో 1,070 పేద కుటుంబాలకు నూతన రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నామని, 1971 మందిని రేషన్ కార్డులలో కొత్త సభ్యులుగా జమ చేస్తున్నామన్నారు. డీఎస్‌వో రజిత, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ప్యాక్స్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ సుధాకర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్‌యాదవ్, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్‌రెడ్డి, వీసీ వినోద్‌రెడ్డి, పులి లక్ష్మీపతి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.