
కంపుకొడుతున్నాయ్..
పందులు సంచరిస్తున్న ఈ ప్రాంతం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ కాలనీ. స్థానికంగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించకపోవడంతో పందులు, కుక్కలు సంచరిస్తున్నాయి. పందులను ఊరుదాటించాలని ప్రజలు చేసిన విన్నపాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇది ముస్తాబాద్ మండల కేంద్రం శివారులోని డంపింగ్‌యార్డు. మండల కేంద్రం నుంచి సిద్దిపేట దారిలో పెద్దచెరువు కింద ఉంది. దీనికి సమీపంలోనే ఒడ్డెరకాలనీ, ఎస్సీ కాలనీలు ఉంటాయి. దీని నుంచి వస్తున్న దుర్వాసనతో వారు ఇబ్బందిపడుతున్నారు. గతంలోనూ ఆ కాలనీవాసులు డంపింగ్‌యార్డు ఎత్తివేయాలని నిరసనకు దిగారు.
● చెత్తాచెదారం.. పందుల విహారం
● ఇబ్బంది పడుతున్న ప్రజలు
● పట్టించుకోని అధికారులు
ఇది ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో పేరుకుపోయిన డ్రైనేజీ. గ్రామంలో మురికినీటి కాల్వలను పంచాయతీ సిబ్బంది శుభ్రం చేయడం లేదనడానికి ఇది నిదర్శనం. పేరుకుపోయిన మురుగునీటి కాలువల నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు రోగాలపాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది.

కంపుకొడుతున్నాయ్..

కంపుకొడుతున్నాయ్..

కంపుకొడుతున్నాయ్..