
హామీలు నెరవేర్చి ఎన్నికల్లోకి రావాలి
● స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం ● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్లఅర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే ఎన్నికల్లోకి రావాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆంధ్రవాళ్లకు తాకట్టు పెడుతున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు దిమ్మతిరిగే ఫలితాలు బీఆర్‌ఎస్ సాధిస్తుందని సవాల్ విసిరారు. ఆంధ్రకు చెందిన సీఎం రమేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కుమ్మకై కేటీఆర్‌ను విమర్శించినంత మాత్రాన నాయకుడు కాలేడన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ప్రజలకు మెరుగైన సేవలు అందించకుండా బీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపనలు చేస్తూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. మేడిగడ్డను రిపేరు చేసి ఉంటే రైతులకు సాగునీటికి ఇబ్బంది ఉండేది కాదన్నారు. గజభీంకార్ రాజన్న, న్యాలకొండ రాఘవరెడ్డి, దార్ల సందీప్, కృష్ణారెడ్డి, మనోజ్‌కుమార్, రవిగౌడ్, అమర్‌రావు, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.