
మాన్వాడలో గ్రామసభ
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు నిర్మాణ గ్రామం మండలంలోని మాన్వాడలో నిర్వాసితుల సమస్యలపై తహసీల్దార్ కాలె నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులై ఉండి గెజిట్ కాని పలువురు గెజిట్ పబ్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పలువురు యువతీ, యువకుల పరిహారం, ప్యాకేజీ కోసం దరఖాస్తులు అందించారు. వివిధ సమస్యలపై 401 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎంపీడీవో భీమ జయశీల, పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ, మాజీ సర్పంచు రామిడి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ప్రకృతి పరిరక్షణతోనే మానవ మనుగడ
సిరిసిల్లకల్చరల్: ప్రకృతి పరిరక్షణతోనే మాన వ మనుగడ ఆధారపడి ఉందనే విషయాన్ని విద్యార్థులు విస్మరించరాదని జిల్లా ఇంటర్మీ డియట్ విద్యాధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. విధిగా మొక్కలు నాటి, సంరక్షించాలని కో రారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో సోమవారం మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్ తదితరులు ఉన్నారు.

మాన్వాడలో గ్రామసభ