
పెన్షన్ ఇస్తావా.. రాజీనామా చేస్తావా
సిరిసిల్ల అర్బన్: ‘పెన్షన్ ఇస్తావా.. రాజీనామా చేస్తావా’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డులో గల ఫంక్షన్‌హాల్‌లో పెన్షన్ పెంపుపై ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వికలాంగులు, వృద్ధులపట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. ఎన్నికల ముందు వికలాంగులు, వృద్ధులకు పెంచుతానన్న పెన్షన్ 20నెలలు గడుస్తున్నా ఎందుకు పెంచడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని రకాల పెన్షన్లు పెంచుతామని సీఎం హామినిచ్చి ఇప్పటి వరకు అమలు చేయడం లేదన్నారు. పేదల డబ్బును ప్రభుత్వం రుణమాఫీకోసం వినియోగించిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ కూడా భూస్వాములకే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. 2007 నుంచి వికలాంగులకు అండగా ఉండేది ఎమ్మార్పీఎస్ పార్టీయే అని వివరించారు. ఇప్పటికై నా వికాలాంగులకు రూ.6 వేలు, ఆసరా పెన్షన్ రూ.4 వేలు పెంచాలన్నారు. అలాగే ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే వికలాంగులు, పెన్షన్‌దారుల మహాగర్జన సభను విజయంతం చేయడానికి జిల్లాలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో వికలాంగుల చేయూత హక్కుల పోరా ట సమితి సభ్యుడు గోపాల్‌రావు, వైస్‌చైర్మన్‌లు రాంబాబు, నాగేశ్వర్‌రావు, వికలాంగుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత, జిల్లా ఇన్‌చార్జి పుట్ట రవి, జిల్లా కన్వీనర్ శోభారాణి, నాయకులు లక్ష్మణ్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ