
బ్యాంకు రుణాలు ఇవ్వాలి
నాలుగేళ్లుగా 4 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల వ ద్ద అప్పు తీసుకొచ్చి సాగు చేస్తున్నాను. వర్షాభావ పరిస్థితులతో పెట్టుబడి కూడా రావడం లేదు. కౌలు చెల్లించలేక, అప్పులపాలవుతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి.
– బైకని ఎల్లయ్య, రగుడు
ప్రభుత్వం ఆదుకోవాలి
రెండెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. వర్షాభావ పరిస్థితులతో గతేడాది పెట్టుబడి కూడా రాలేదు. కౌలు డబ్బులు కట్టేందుకు అప్పు తీసుకొచ్చిన. ఈ సారైనా పంట వస్తుందనుకుంటే మొదట్లోనే వర్షాలు పడడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– గందం రవి, పెద్దూరు
రైతుభరోసా వర్తింపజేయాలి
మూడెకరాలు కౌలుకు తీసుకున్న. యాసంగి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. దానికితోడు మద్దతు ధర లేక ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రస్తుతం అప్పు తీసుకొచ్చి సాగుచేస్తున్నా. కౌలురైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
– మేడుదుల మల్లేశం, ఇప్పలపల్లి

బ్యాంకు రుణాలు ఇవ్వాలి

బ్యాంకు రుణాలు ఇవ్వాలి