
నేరస్తులను గుర్తించడంలో జాగిలాలు కీలకం
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లక్రైం: నేరస్తులను గుర్తించడంలో పోలీసు జాగిలాల పాత్ర కీలకమని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. జాగిలాల కోసం నూతనంగా నిర్మించిన గదులను శుక్రవారం ప్రారంభించారు. నేరపరిశోధన, భద్రతచర్యలు, మాధకద్రవ్యాల నియంత్రణ, విపత్తు పరిస్థితుల్లో పోలీస్ జాగిలాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. శిక్షణ సామర్థ్యంతో విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నామని తెలిపారు. విశ్వాసానికి మారుపేరుగా నిలిచే జాగిలాలు పోలీస్‌శాఖకు నేరపరిశోధనలో కీలకంగా మారుతున్నాయన్నారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జగిన సమయంలో నేరస్తులను పట్టించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. పోలీస్ జగిలాలకు అధునాతన శిక్షణ, వైద్యం, వసతి కల్పించనున్నట్లు చెప్పారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐలు కృష్ణ, మొగిలి, నటేశ్, ఆర్‌ఐలు రమేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.