
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
వేములవాడ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్లో మహిళా బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేకప్ అండ్ హెయిర్ పే సెమినార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలు ఎంచుకున్న రంగాల్లో రాణిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పద్ధతులను అప్‌గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. రాధిక, కవిత, స్రవంతి, మాధవి, స్వప్న, మంజుల, జ్యోతి, మేకప్ ఆర్టిస్టు లక్ష్మీ బంధకవి పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్