
కరీంనగర్ రోడ్డులో సంజీవయ్య విగ్రహం
సిరిసిల్ల: జిల్లాకేంద్రంలోని మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని కరీంనగర్ ప్రధాన రోడ్డు మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు దిమ్మె నిర్మాణ పనులు చేపట్టారు. పట్టణంలోని సంజీవయ్యనగర్‌కు వెళ్లే దారిలో 2006లో విగ్రహ ఆవిష్కరణ కమిటీ చైర్మన్ రాగుల రాములు ఆధ్వర్యంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి చేతు ల మీదుగా సంజీవయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రతి వర్షాకాలంలో చిన్నపాటి వర్షం పడినా సంజీవయ్య విగ్రహం వెనకాల దారిలో భారీ గా వరద వచ్చి చేరుతుంది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. సంజీవయ్య విగ్రహాన్ని రోడ్డు మీద ఏర్పాటు చేసి ఆ దారిలో వర్షం నీరు నిల్వ ఉండకుండా.. కల్వర్టును నిర్మించి రోడ్డు ఎత్తును పెంచేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సంజీవయ్యవిగ్రహాన్ని రోడ్డుపైకి మార్చుతున్నారు. కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా..? అదే విగ్రహాన్ని షిఫ్ట్ చేస్తారా.? ఇంకా స్పష్టత లేకపోయినా.. మున్సిపల్ నిధులు రూ.లక్షతో రహదారి మధ్యలో దిమ్మె నిర్మాణ పనులు సాగుతున్నాయి.