
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
సిరిసిల్లకల్చరల్: మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సులువుగా పరిష్కరించవచ్చని సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్ పేర్కొన్నారు. జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. పౌర సమస్యలు, కుటుంబ సంబంధ వివా దాలను శాంతియుతంగా పరిష్కరించే లక్ష్యంగా జాతీయస్థాయిలో మధ్యవర్తిత్వాలను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ, హైదరాబాద్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో మధ్యవర్తిత్వంపై ప్రత్యేక శిక్షణ కోసం అర్హత, ఆసక్తి గల న్యాయవాదుల ప్రతిపాదిత జాబితాను ఇప్పటికే పంపించినట్లు తెలిపారు. సుమారు 40 గంటల పాటు మధ్యవర్తిత్వ ప్రక్రియపై శిక్షణ పొందిన వారిని అధికారిక మధ్యవర్తులుగా గుర్తిస్తారన్నారు. జిల్లాలో ఈ ప్రక్రియను జయప్రదం చేయాలని న్యాయవాదులను కోరారు.