
ప్రాజెక్టులు నింపేదెప్పుడో?
● బీఆర్‌ఎస్ నాయకుల నిరసన
గంభీరావుపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలోని చెరువులు ఎండిపోతున్నాయని.. కాళేశ్వరం నీటితో నింపాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం నిరసనలు తెలిపారు. ఇందులో భాగంగా గంభీరావుపేట నాయకులు నర్మాల ఎగువమానేరులో క్రికెట్ ఆడారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్, రామలక్ష్మణపల్లి, తుర్కపల్లి గ్రామాల నాయకులు పెద్దచెరువు వద్ద నిరసన తెలిపారు. ఒన్నాల వెంకటేశ్, ఆకునూరి రాజేందర్, ఎడబోయిన రాజు, రాజబోయిన ఆంజనేయులు, గొర్రె కిషోర్, సుదర్శన్, సత్యం, రాజు, సతీశ్‌చందర్, మల్లారెడ్డి, పద్మారెడ్డి, రవీందర్‌రెడ్డి, రవి, జక్కుల యాదగిరి, విశ్వనాథం పాల్గొన్నారు.
నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో క్రికెట్ ఆడుతున్న బీఆర్‌ఎస్ నాయకులు

ప్రాజెక్టులు నింపేదెప్పుడో?