
చినుకు రాదు.. మానేరు నిండదు
● కురవని వర్షం ● మిడ్‌మానేరులోకి చేరని వరద ● ఆందోళనలో రైతాంగం ● ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో అత్తెసరు నీరు ● భారీ వర్షాలపైనే ఆశలు
మిడ్, అప్పర్, లోయర్‌మానేరు ప్రాజెక్టుల నీటి నిల్వ వివరాలు
మిడ్‌మానేరు పూర్తి నీటి సామర్థ్యం : 27.50 టీఎంసీలు
ప్రస్తుతం ఉన్న నీరు : 6.821 టీఎంసీలు
ఎల్‌ఎండీ పూర్తి నీటిమట్టం : 24.034, టీఎంసీలు
ప్రస్తుత నీటిమట్టం : 6,07 టీఎంసీలు
ఎగువ మానేరు నీటిమట్టం : 2 టీఎంసీలు
ప్రస్తుతం ఉన్న నీరు : 0.61 టీఎంసీలు
బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటే ఉన్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల అప్పర్ మానేరు, కరీంనగర్ ఎల్‌ఎండీ ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. రెండు నెలలుగా ముసురు తప్ప భారీ వర్షాలు కురవక ప్రాజెక్టుల్లో వరద చేరలేదు. ప్రాజెక్టులో ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు కేవలం 0.319 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. కాగా ప్రాజెక్టులో 26 టీఎంసీల నీరు ఉంటే బ్యాక్‌వాటర్ 17 కి.మీ మేర ఉండగా, ప్రస్తుతం 6 కి.మీ మాత్రమే ఉంది.
నీరు లేక అడుగంటిన మిడ్‌మానేరు ప్రాజెక్టు