
జిల్లా అంతటా తుంపర వర్షం
సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా ఆదివారం తుంపర వర్షం పడింది. అత్యధికంగా కోనరావుపేటలో 33.0 మిల్లీమీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 1.0, చందుర్తి 1.9, వేములవాడరూరల్ 0.8, బోయినపల్లి 5.8, వేములవాడ 14.4, సిరిసిల్ల 1.0, వీర్నపల్లి 20.3, ఎల్లారెడ్డిపేట 1.2, గంభీరావుపేట 1.4, ముస్తాబాద్ 2.0, తంగళ్లపల్లి 12.3, ఇల్లంతకుంట 7.1 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా సగటున 7.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
పేదవాడి ఆత్మగౌరవం రేషన్ కార్డు
గంభీరావుపేట(సిరిసిల్ల): పేదవాడి ఆత్మగౌరవం రేషన్ కార్డు అని, రాష్ట్ర ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకొని రేషన్‌కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా చేపట్టిందని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ తహసీల్దార్ మారుతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొమిరిశెట్టి తిరుపతి, మండల అధ్యక్షుడు హమీద్, నాయకులు రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాకపోకలకు అంతరాయం
కోనరావుపేట(వేములవాడ): మూలవాగు ప్రవాహంతో మండలంలోని మామిడిపల్లి–నిజామాబాద్ గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ దెబ్బతింది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మూలవాగు ప్రవహిస్తోంది. దీంతో మామిడిపల్లి–నిజామాబాద్, బావుసాయిపేట– వెంకట్రావుపేట, వట్టిమల్ల–నిమ్మపల్లి గ్రామాల మధ్య మూలవాగు ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన వంతెనలు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మానేరు
సిరిసిల్ల అర్బన్: బీఆర్‌ఎస్ హయాంలో కళకళలాడే మానేరు వాగు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎడారిలా మారిందని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ అన్నారు. ఆదివారం మానేరు వాగులో క్రికెట్ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు మానేరు నిండుకుండలా ఉందన్నారు. వర్షాకాలంలో రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే మానేరువాగు ప్రస్తుతం క్రికెట్ ఆడుకోవడానికి అనువుగా ఉందన్నారు. సిరిసిల్ల ప్రజల మీద కక్షతో మిడ్‌మానేరు నింపకపోవడంతో మానేరువాగు పూర్తిగా ఎండిపోయిందన్నారు. ఓ వైపు భూగర్భజలాలు అడుగంటుకుపోతున్నాయని, బోర్లు వేసినా చుక్క నీరు రావడం లేదన్నారు. ఇలాగే ఉంటే ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పవన్నారు. నాయకులు మానాల అరుణ్, సాయిదీపక్, వెంకటరమణ, రమణాచారి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అంతటా తుంపర వర్షం

జిల్లా అంతటా తుంపర వర్షం

జిల్లా అంతటా తుంపర వర్షం