
పండుగలా వన మహోత్సవం
● సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా
సిరిసిల్లటౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవాన్ని సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో పండుగలా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని 13, 17, 18వ వార్డులలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా పాల్గొన్నారు. ప్రజలంతా పచ్చని మొక్కలను బాధ్యతగా పెంచాలని కోరారు. ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. 13వ వార్డు మాజీ కౌన్సిలర్ జాగీరు శైలు, నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్, 17వ వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ, కాంగ్రెస్ నాయకులు రాపెల్లి కళ్యాణ్, కోడం అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.