
రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
కోనరావుపేట/చందుర్తి/రుద్రంగి(వేములవాడ): రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం ధర్మారంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో శనివారం లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు రేషన్‌కార్డు ఒక గుర్తింపుకార్డుగా మారిందన్నారు. మండలంలో 889 నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, 1,806 మంది పేర్లను కొత్తగా నమోదుచేశామని, వీటి ద్వారా దాదాపు 2,696 మంది పేదలకు అదనంగా రేషన్ అందుతుందని తెలిపారు. గల్ఫ్‌లో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా కోనరావుపేట మండలంలో అమలు చేశామని గుర్తు చేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ ఎల్ల య్య, వైస్‌చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, సివిల్ సప్లయ్ డీఎం రజిత, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఫి రోజ్‌పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, తహసీల్దార్ వరలక్ష్మి పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమ పథకాలు
పేదల ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అండగా నిలవాలని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ కోరారు. చందుర్తిలోని పురగిరి క్షత్రియ కమ్యూనిటీహాల్‌లో మండలంలోని పలు గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన 254 రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రజిత, ఎంపీడీవో రాధ, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, పార్టీ మండలాధ్యక్షుడు చింతపటి రామస్వామి, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు పుల్కం మోహన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏనుగు లచ్చిరెడ్డి పాల్గొన్నారు.
రుద్రంగి అభివృద్ధికి కృషి
రుద్రంగి మండల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే రుద్రంగి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. రేషన్‌కార్డులు పంపిణీ చేసినట్లు సందర్భంగా మాట్లాడారు. రుద్రంగి మండల కేంద్రంలో ఏటీసీ కళాశాల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రూ.1.50కోట్లతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తర్రె లింగం పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్