
బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం
సిరిసిల్లటౌన్: ఆంధ్రప్రదేశ్‌లోని బనకచర్ల ప్రాజెక్ట్‌తో గోదావరినదిలో తెలంగాణ రాష్ట్రం 200 టీఎంసీల నీటి వాటా కోల్పోయే పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ పేర్కొన్నారు. గోదావరిలో నీటి వాటా తేల్చే వరకు ఆంధ్రప్రదేశ్‌లోని బనకచర్లను అడ్డుకుంటాం.. అనే నినాదంతో బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో శనివారం నుంచి ఐదు రోజులపాటు చైతన్య కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. ఇందులో భాగంగా సిరిసిల్లలోని ఇంటర్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన చైతన్య కార్యక్రమంలో హరీశ్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ నిర్మించతలపెట్టిందే పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు అన్నారు. తెలంగాణ నీటిహక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు, బీజేపీకి లొంగిపోయి లోపాయికారీగా సహకరిస్తున్నారని విమర్శించా రు. ఇప్పటికై నా మేల్కోనకపోతే హైదరాబాద్‌కు తాగునీటి గోస, రాష్ట్ర రైతులకు ఎప్పటికీ బోర్లే దిక్కవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
● బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్