
మోస్తరు వర్షాలు
సిరిసిల్ల: జిల్లాలో శనివారం మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తుండగా.. కొద్దిపాటి వర్షం కురిసింది. వేములవాడరూరల్‌లో 69.1 మిల్లీమీటర్ల అత్యధిక వర్షం నమోదైంది. రుద్రంగిలో 11.5, చందుర్తిలో 43.1, బోయినపల్లిలో 24.4, వేములవాడలో 56.5, సిరిసిల్లలో 11.3, కోనరావుపేటలో 48.7, వీర్నపల్లిలో 39.0, ఎల్లారెడ్డిపేటలో 35.9, గంభీరావుపేటలో 40.6, ముస్తాబాద్‌లో 16.1, తంగళ్లపల్లిలో 38.0, ఇల్లంతకుంటలో 3.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వాప్తంగా సగటున 33.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 252.1 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటి వరకు ఈ ఏడాది 194.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు జిల్లాలో 23 శాతం లోటు వర్షం ఉంది. గతేడాది శనివారం వరకు 294.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిరుటితో పోలిస్తే.. 100 మిల్లీ మీటర్ల తక్కువ వర్షం పడింది.