● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: రెండు వారాలకు మించి దగ్గు, తెమడతో బాధపడే వారికి క్షయవ్యాధి పరీక్షలు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో గురువారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆశవర్కర్లు ఇంటింటి సర్వే ద్వారా రెండు వారాలకు మించి దగ్గు, తెమడతో బాధపడుతున్న వారిని గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలకు పంపించాలని సూచించారు. ఆరోగ్య మహిళ స్క్రీనింగ్ పరీక్షలకు ఆశలు ఏఎన్‌ఎంలు ఆరోగ్య కేంద్ర పరిధిలో గల మహిళలను రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, నోటి క్యాన్సర్ల పరీక్షల కోసం ఆరోగ్య మహిళా క్లినిక్‌లలో పరీక్షలు చేయించాలన్నారు. డీఐవో డాక్టర్ సంపత్‌కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ అనిత, డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.