
ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు ఆదాయం
● ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్
బోయినపల్లి(చొప్పదండి): ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ తెలిపారు. మండలంలోని మర్లపేటలో ఆయిల్‌పామ్ తోటలను గురువారం సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. సాగుతో రైతులు ఏడాదికి రూ.1.50లక్షల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. రూ.20కే మొక్కలు అందుబాటులో ఉన్నాయని.. ఎకరాకు రూ.4,200 వరకు సబ్సిడీ మంజూరవుతుందని తెలిపారు. డ్రిప్ పరికరాలపై రాయితీలు అందుతున్నట్లు వివరించారు. వేములవాడ నియోజకవర్గ ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి లోకేశ్, గోవర్ధన్, ఎంఏవో ప్రణీత, ఫ్రీ యూనిక్ కంపెనీ జిల్లా మేనేజర్ ప్రేమ్‌సాయి, ఆయిల్‌పామ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.