
ఇలా వదిలేస్తే.. ఎలా వెళ్లేది?
సిరిసిల్ల: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట. పట్టణ శివారులోని చంద్రంపేట ఒకటో వార్డు పరిధిలో పోచమ్మవీధిలో మిషన్‌భగీరథ పైపులైన్ లీకేజీ ఉండగా.. గొయ్యి తవ్వి రిపేరు చేశారు. కానీ ఆ గొయ్యిని పూడ్చకుండా అలాగే వదిలేయడంతో మురికి నీరు, వర్షం నీరు చేరి రోడ్డు బుదరమయంగా మారింది. ఆ వీధి గుండా పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సిరిసిల్ల మున్సిపల్ అధికారులు తవ్విన నల్లాపైపు గొయ్యిని పూడ్చివేసి రోడ్డుపై బురదలేకుండా చేయాలని చంద్రంపేట వాసులు కోరుతున్నారు.