
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● వెంటనే బెంచీలు పంపించిన వైనం
వేములవాడరూరల్: పాఠశాలలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పంచాయతీ కార్యదర్శి, హెచ్‌ఎంలకు సూచించారు. వేములవాడరూరల్ మండలం మారుపాక ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్‌లను బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంపై బడిబాటలో ఏం చేశారని ప్రశ్నించారు. విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవని తెలుసుకొని.. వెంటనే పంపించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాఠ్యాంశాలు చదివిపించారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్ ఏర్పాటుకు మారుపాకలోని సర్వేనంబర్ 339లో పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, డీటీసీపీవో అన్సర్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.