
పట్టణ, ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం
● గోశాలకు కేబినేట్ ఆమోదం ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: రాజన్న ఆలయం, వేములవాడ పట్టణలను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. రూ.వెయ్యి కోట్లతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ చేశామన్నారు. ఆలయానికి రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాజన్న ఆలయానికి ఏటా రూ.100కోట్లు ఇస్తానని మోసం చేసిందన్నారు. 50 ఎకరాల్లో గోశాలను నిర్మించేందుకు క్యాబినేట్ మీటింగ్‌లో నిధులు కేటాయించడం జరిగిందన్నారు. శృంగేరిపీఠం అనుమాతులతో భీమేశ్వర ఆలయంలో త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిన్నామన్నారు.