
నేడు సిరిసిల్లకు కేటీఆర్ రాక
● పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖీ సమావేశం
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కె.తారక రామారావు గురువారం సిరిసిల్లకు వస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బుధవారం తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో తెలంగాణ భవన్‌లో వేర్వేరుగా సమావేశమవుతారని పేర్కొన్నారు. హైద రాబాద్ నుంచి బయలుదేరి సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌కు చేరుకుంటారని తెలిపారు. ఉదయం ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల నాయకులతో సమావేశమవుతారని మధ్యాహ్న భోజనం అనంతరం వీర్నపల్లి, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల నాయకులతో మాట్లాడుతారని వివరించారు. అన్ని మండలాల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయానికి చేరుకోవాలని కోరారు.