
రాజన్న హుండీ ఆదాయం రూ.1.59 కోట్లు
వేములవాడ: రాజన్నకు భక్తులు హుండీలలో సమర్పించుకున్న కట్నాలు, కానుకలను ఆలయ అధికారులు బుధవారం లెక్కించారు. రూ.1.59కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈవో రాధాభాయి తెలిపారు. బంగారం 279 గ్రాములు, వెండి 14.700 కిలోలు సమకూరింది. ఆలయ అధికారులు సత్యనారాయణ, శ్రవణ్, శ్రీనివాస్, జయకుమారి, అశోక్ పర్యవేక్షించారు.
గంజాయి విక్రేతల రిమాండ్
● 250 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం
బోయినపల్లి(చొప్పదండి): ఇద్దరు గంజాయి వికేత్రలను రిమాండ్‌కు తరలించడంతోపాటు వారి నుంచి 250 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వేములవాడరూరల్ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన వేముల శ్రీనివాస్, వేముల విజయలక్ష్మి మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గ్రానైట్ కార్మికులకు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో బుధవారం బోయినపల్లి మండలం కోరేం శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిద్దరిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి వద్ద 250 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
తడి, పొడి చెత్త వేరు చేయండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తడి, పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ సిబ్బందికి అప్పగించాలని, వారు ఆ చెత్తను కంపోస్ట్‌షెడ్లకు తరలిస్తారని స్వచ్ఛ సర్వేక్షన్ జిల్లా ఇన్‌చార్జి సురేష్, ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. మండలంలోని సింగారం, నారాయణపూర్ గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త సేకరణ నిత్యం చేపట్టాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచితే రోగాలు దూరమవుతాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ సభ్యులు అనూష, శిరీష, కార్యదర్శులు పాల్గొన్నారు.

రాజన్న హుండీ ఆదాయం రూ.1.59 కోట్లు

రాజన్న హుండీ ఆదాయం రూ.1.59 కోట్లు