
కళ్ల ముందే ‘డబుల్’.. అద్దెకు ట్రబుల్
నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఏళ్లుగా నిరుపయోగంగానే ఉంటున్నాయి. నిర్మాణ పనులు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కళ్ల ముందే వందలాది ఇండ్లు ఖాళీగా ఉంటుండగా.. పలువురు నిరుపేదలు కిరాయి ఇంట్లో ఉంటూ అద్దె చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ బైపాస్ పక్కన 204 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఖాళీగా ఉంటున్నాయి. జనం లేకపోవడంతో ఇండ్ల మధ్య పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. కొన్ని ఇండ్ల కిటికి అద్దాలు పగిలిపోయాయి. ఇప్పటికై నా అధికారులు వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల

కళ్ల ముందే ‘డబుల్’.. అద్దెకు ట్రబుల్