
కూల్చివేతలు.. నిరసనలు
● వంతెన కోసం తిప్పాపూర్‌లో స్థల సేకరణ పనులు ● జేసీబీలతో ఇళ్ల కూల్చివేత
వేములవాడ అర్బన్: మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్‌లో ఇళ్ల నిర్మాణాల కూల్చివేతలు నిరసనల మధ్య కొనసాగాయి. మూలవాగుపై రెండో వంతెన పనుల కోసం తిప్పాపూర్ లోని నిర్మాణాల కూల్చివేతలను అధికారులు సోమవారం ఉదయం ప్రారంభించారు. తమ ఉపాధి పోతుందని, ఉండేందుకు నీడ కరువైందని పలువురు బాధితులు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ మహిళా రోడ్డుపై అడ్డంగా పడుకోగా, ఇద్దరు యువకులు ఓ హోర్డింగ్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. నిర్వాసితులు రాజేశ్వరీ, బాబు కుటుంబంతో కలిసి అడ్డుకున్నారు. తమకు ఇళ్ల పరిహారం రాలేదని, ఇచ్చిన తర్వాతనే కూల్చివేయాలని కోరారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నిర్మాణాల కూల్చివేతలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి తిప్పాపూర్‌లోని గోశాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. గోశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆర్డీవో రాధాబాయి, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, తహసీల్దార్లు ఉన్నారు.
ఇళ్లను కూల్చివేస్తున్న జేసీబీ